కరకగూడెం: రోగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – వైద్యాధికారి డా. పి. రవితేజ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని సమత్ మోతె పంచాయితీ పరిధిలోని గొల్లగూడెం పాఠశాలలో సోమవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యాధికారి డా. పి. రవితేజ ప్రజలు రోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రస్తుతం వివిధ రకాల అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ముఖ్యంగా టీబీ వంటి వ్యాధులను తేలికగా తీసుకోకుండా, సరైన సమయంలో పరీక్షలు చేయించుకొని, పూర్తి స్థాయి చికిత్స తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లబోయిన ముత్తమ్మ, హెల్త్ సూపర్వైజర్ పోలెపోయిన కృష్ణయ్య, టెక్నికల్ అసిస్టెంట్ సాయి కృష్ణ, టీబీ సూపర్వైజర్లు ప్రేమ్ కుమార్, సాయి కుమార్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.









