శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు
కరకగూడెం,ఫిబ్రవరి 28 ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహ మహోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు నూతన విద్యుత్ దీపాలను సమకూర్చారు.
గ్రామ సర్పంచ్ పోలేబోయిన సుజాత ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలను శుభ్రపరచించి, గుడి అలంకరణ కోసం కొత్త లైట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఉప సర్పంచ్ బుడగం రాము పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామి వారి ఆశీస్సులతో గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, వివాహ మహోత్సవ వేడుకలు శాంతి, ఐక్యతతో ఘనంగా జరగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు, మండల నాయకులు గొగ్గలి రవి, ముంజాల సాయిబాబా, సోలం బాబు, కొమరం భూషణం, వార్డు మెంబర్ వేణు, బిలపాటి సంపత్ తదితరులతో పాటు భక్తులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post Views: 26









