ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  అనంతారం కాంప్లెక్స్‌లో ఘనంగా బాలా మేళా

అనంతారం కాంప్లెక్స్‌లో ఘనంగా బాలా మేళా

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
విద్యార్థుల ప్రాథమిక భాషా, గణిత అభ్యాస నైపుణ్యాల పెంపుతో పాటు సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అనంతారం కాంప్లెక్స్ స్థాయిలో నిర్వహించిన “బాలా మేళా” కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలల నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల కోసం రాత పరీక్షలు, కథల వినిపింపు, చదవడం, గణిత నైపుణ్యాల ప్రదర్శన వంటి విద్యా మరియు సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వసంత్ మాట్లాడుతూ, బాలా మేళా వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నేర్చుకునే ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసే వేదికగా నిలుస్తాయని తెలిపారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు.

మండల విద్యాధికారి జి మంజుల మాట్లాడుతూ, కార్యక్రమ నిర్వహణలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చూపిన కృషిని ప్రశంసించారు. విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదలలో ఇటువంటి కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు.

పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

మండల రిసోర్స్ పర్సన్స్ జె. వెంకటేశ్వర్లు, భావ్ సింగ్, ఆట యూనియన్ మండల అధ్యక్షులు కుమారస్వామి, యుటిఎఫ్ మండలాధ్యక్షులు కోట్ల సూర్యనారాయణతో పాటు ఉపాధ్యాయులు నారాయణ, రామస్వామి, సర్వేశ్వరరావు, వినోద్, వసంత, శకుంతల, సుప్రియ, ఉమ, సి ఆర్ పి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….