కరకగూడెం మండలంలో FLN అసెస్మెంట్ సర్వే విజయవంతం.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన FLN (Foundational Literacy & Numeracy) అసెస్మెంట్ శాంపిల్ సర్వే మూడు రోజులపాటు విజయవంతంగా జరిగింది. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు నిర్వహించిన ఈ సర్వేలో 2వ తరగతి విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన స్థాయిని అంచనా వేశారు.
సర్వేలో భాగంగా విద్యార్థుల ప్రతిభను టింగరిన్ యాప్ (Tingrin App) ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరిగింది. డిజిటల్ విధానంలో తక్షణ నమోదు చేయడం ద్వారా పారదర్శకత, ఖచ్చితత్వం పెరిగినట్లు అధికారులు తెలిపారు.
మండలంలోని మొగిలితోగు, రేగళ్ల ,మద్దెలగూడెం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ సమన్వయంతో అసెస్మెంట్ కార్యక్రమం క్రమబద్ధంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారిణి జి. మంజుల పాఠశాలలను సందర్శించి అసెస్మెంట్ ప్రక్రియను పరిశీలించారు. కాంప్లెక్స్ ఉపాధ్యాయుడు టి. మోహన్ బాబు కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, సిఆర్పీలు సాంబశివరావు, విష్ణుమూర్తి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్‌కు మార్గనిర్దేశనం చేశారు.
విద్యార్థుల చదవడం, వ్రాయడం, అర్థం చేసుకోవడం మరియు గణిత నైపుణ్యాలపై సమగ్రంగా అంచనా వేయబడింది. అధికారుల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల సహకారంతో కార్యక్రమం సమర్థవంతంగా పూర్తైంది.
ప్రతి విద్యార్థికి నాణ్యమైన ప్రాథమిక విద్య అందించడమే FLN కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.








