తెలంగాణలో వాహనాల ధరలు పెరుగనున్నాయి – మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమలు
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: తెలంగాణలో వాహనదారులకు ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనుంది. రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుండి కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై “రోడ్ సేఫ్టీ సెస్” (భద్రత పన్ను) విధించేందుకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కొత్త నిబంధన ప్రకారం కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు మరియు ఇతర నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై రూ.2,000 నుండి రూ.10,000 వరకు పన్ను వసూలు చేయనున్నారు. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ భద్రత పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయంతో రహదారి భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ పన్ను ద్వారా సంవత్సరానికి సుమారు రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
మార్చి 1 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త పన్ను వల్ల వాహనాల ధరలు కొంతమేర పెరగనున్నాయి. దీంతో వాహన కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది.








