చింతకాయల కోసం చెట్టెక్కి ప్రమాదం – మహిళ పరిస్థితి విషమం
కరకగూడెం,ఫిబ్రవరి 21 ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని చొప్పల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చింతకాయల కోసం చెట్టెక్కిన ఓ మహిళ ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడింది.
గ్రామానికి చెందిన బేత సారక్క (55) అనే మహిళ చింతపండ్లు రాల్చేందుకు చింతచెట్టు పైకి ఎక్కింది. ఈ క్రమంలో కాలుజారి అదుపుతప్పి కిందపడింది. ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సారక్క కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో, మానవతా దృక్పథంతో సహాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
📞 సహాయం కోసం సంప్రదించవలసిన నంబర్: 86393 89265








