పద్మాపురంలో నూతన 33/11 కేవీ ఉపకేంద్రం పనులు పూర్తి
డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) మోహన్ రావు పరిశీలన
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
భద్రాచలం డివిజన్ పరిధిలోని కరకగూడెం సెక్షన్‌లో పద్మాపురం గ్రామంలో నిర్మించిన నూతన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పనులు పూర్తయ్యాయి. డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) శ్రీ మోహన్ రావు ఉపకేంద్రాన్ని సందర్శించి పూర్తయిన పనులను పరిశీలించారు.
ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన సాంకేతిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ విధానాలను సమీక్షించిన ఆయన, భద్రతా అంశాలపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. సిబ్బంది భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తూ ఉపకేంద్ర నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో SE/OP/BKGM, DE (టెక్నికల్) & SO/BKGM, DE/MRT & C/BKGM, DE/OP/భద్రాచలం తదితర అధికారులు పాల్గొన్నారు.
నూతన ఉపకేంద్రం త్వరలో ప్రారంభమై పరిసర గ్రామాలకు స్థిరమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించనుందని అధికారులు తెలిపారు.








