జర్నలిస్ట్ కప్–2026కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఆహ్వానం అందజేసిన జర్నలిస్టులు
పినపాక,ఆధాబ్ న్యూస్:
పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (ప్రజాభవన్)లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిసి జర్నలిస్ట్ కప్–2026 క్రికెట్ టోర్నమెంట్‌కు ఆహ్వాన పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, జర్నలిస్టుల మధ్య స్నేహభావం, క్రీడాస్ఫూర్తి, ఐక్యతను పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృత్తి బాధ్యతలతో పాటు క్రీడల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జర్నలిస్టులు సమాజానికి దిశానిర్దేశం చేసే వర్గమని, వారిలో ఐక్యత మరియు సత్సంబంధాలు పెంపొందించేందుకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు అవసరమని తెలిపారు. టోర్నమెంట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
అనంతరం మణుగూరు డిఎస్పీ వంగ రవీందర్ రెడ్డి, సిఐ నాగబాబు, ఎస్సైలను కలిసి ఆహ్వాన పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పినపాక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కీసర సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ బృహస్పతి, బిల్లా నాగేందర్, ముక్కు మహేష్ రెడ్డి, సనప భరత్, కట్టా శ్రీనివాసరావు, బూరా శంకర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.








