ఎస్సై పి.వి.ఎన్. రావు సూచనతో కరకగూడెం మండలంలో పులి సంచారం పై అప్రమత్తత హెచ్చరిక.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం పోలీస్ స్టేషన్ ఎస్సై పి.వి.ఎన్. రావు మండల ప్రజలకు ముఖ్య సూచనలు జారీ చేశారు. మండల పరిధిలోని కౌలూరు, రాయన్నపేట రాళ్లవాగు మరియు కన్నాయిగూడెం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు ధృవీకరించినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అడవి సమీప ప్రాంతాలకు అవసరం లేకుండా వెళ్లకూడదని, ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఒంటరిగా సంచరించవద్దని సూచించారు. పశువులను అడవి అంచులకు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ప్రజల భద్రత దృష్ట్యా ఈ సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్సై పి.వి.ఎన్. రావు విజ్ఞప్తి చేశారు.
Post Views: 15









