ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

73.60 శాతం తుది పోలింగ్ నమోదు : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్ :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీలకు సంబంధించిన రెండో సాధారణ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.

జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, అశ్వరావుపేట, ఇల్లందు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 106 వార్డులకు పోలింగ్ నిర్వహించగా, ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా సాగిందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,85,348 మంది ఓటర్లలో 1,36,423 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 73.60 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. ఇందులో పురుష ఓటర్లలో 73.70 శాతం, మహిళా ఓటర్లలో 73.51 శాతం, ఇతర వర్గాల్లో 78.95 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం ఆనందకరమని ఆయన అన్నారు.

మున్సిపాలిటీ వారీగా పరిశీలిస్తే, అశ్వరావుపేట మున్సిపాలిటీలో 16,830 మంది ఓటర్లకు గాను 12,849 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 76.28 శాతం పోలింగ్ నమోదైంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,34,775 మంది ఓటర్లలో 1,00,453 మంది ఓటు వేయడంతో 74.53 శాతం పోలింగ్ నమోదైంది. ఇల్లందు మున్సిపాలిటీలో 33,723 మంది ఓటర్లలో 23,121 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 68.56 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.

పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిందని, పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రాల వద్ద క్యూలో ఉన్న ప్రతి ఓటరికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించినట్లు పేర్కొన్నారు.

ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అధికార యంత్రాంగం, పోలీస్ సిబ్బంది మరియు ప్రజలందరికీ జిల్లా ఎన్నికల అధికారి కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….