ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  కార్మికులు, కష్టజీవుల కుటుంబాలకు ఎస్బిఐ వ్యక్తిగత ప్రమాద భీమా భరోసా – బాపట్ల ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ వి. ఆనంద్ బాబు వెల్లడి

కార్మికులు, కష్టజీవుల కుటుంబాలకు ఎస్బిఐ వ్యక్తిగత ప్రమాద భీమా భరోసా

– బాపట్ల ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ వి. ఆనంద్ బాబు వెల్లడి

బాపట్ల,ఆధాబ్ న్యూస్:
కార్మికులు, కష్టజీవులు మరియు నిరుపేద కుటుంబాలకు ఆపద సమయంలో భరోసా కల్పించే విధంగా State Bank of India (ఎస్‌బిఐ) ప్రత్యేక వ్యక్తిగత ప్రమాద భీమా పాలసీని అందుబాటులో ఉంచిందని బాపట్ల ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ వి. ఆనంద్ బాబు తెలిపారు.

శనివారం ఆయన మాట్లాడుతూ…
ప్రచారం లోపించడంతో ఈ భీమా పాలసీపై చాలా మంది ఖాతాదారులకు సరైన అవగాహన లేకపోతున్నదని, ఫలితంగా సామాన్య మరియు మధ్య తరగతి కుటుంబాలు ఈ అవకాశాన్ని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపద సమయంలో ఎవరో సహాయం చేస్తారని ఎదురుచూడకుండా, తక్కువ ప్రీమియంతోనే పూర్తి రక్షణ కల్పించే భీమా పాలసీ ఎస్బిఐలో ఉందని ఆయన స్పష్టం చేశారు.

సంవత్సరానికి కేవలం రూ.2,000/- (రోజుకు సుమారు రూ.6/- మాత్రమే) ప్రీమియంతో రూ.40 లక్షల వరకు ప్రమాద భీమా కవరేజ్ పొందవచ్చని వివరించారు.

రోడ్డు ప్రమాదం, విద్యుత్ షాక్, వరదలు, భూకంపాలు, పాము కాటు, తేలు కాటు వంటి ఏవైనా ప్రమాదాల వల్ల పాలసీదారునికి మరణం సంభవిస్తే, ఆయన నామినీకి రూ.40 లక్షల భీమా మొత్తం లభిస్తుందని వి. ఆనంద్ బాబు తెలిపారు.

చాలా కాలంగా ఈ సదవకాశం ఉన్నప్పటికీ, పూర్తి సమాచారం లేకపోవడం వల్ల అనేక మంది ఖాతాదారులు లాభం పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఎస్బిఐ ఖాతాదారులు, పాలసీదారులు ఈ వ్యక్తిగత ప్రమాద భీమా పాలసీపై సమగ్ర వివరాలు తెలుసుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….