ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కేసీఆర్ జోలికి వస్తే సహించేదే లేదు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

కేసీఆర్ జోలికి వస్తే సహించేదే లేదు

కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని సమత్ మోతె గొల్లగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్‌కు ప్రత్యేక స్థానం ఉందని, ఆయనపై విమర్శలు చేస్తే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు మలకం వెంకటేశ్వర్లు, మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్, ఉపసర్పంచులు ఇరుప కుచేలుడు, కొమరం నాగేష్, సుతారి నాగేష్, ఇర్ప నాగేష్, చప్పిడి వెంకటేశ్వర్లు, బట్ట బిక్షపతి, ఎల్లబోయిన ఆదినారాయణతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!