ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఫోన్‌లోనే ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్‌ సౌకర్యం నేటి నుంచి అమల్లోకి – ఇక ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు

🤳 ఫోన్‌లోనే ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్‌ సౌకర్యం

నేటి నుంచి అమల్లోకి – ఇక ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు

హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోవడం ఇక మరింత సులభం కానుంది. బుధవారం నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చిందని యూఐడీఏఐ (UIDAI) ప్రకటించింది. ఈ విధానం ద్వారా ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా ఫోన్‌లోనే ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

ఇప్పటివరకు మొబైల్ నంబర్ మార్పు కోసం తప్పనిసరిగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉండేది. తాజా నిర్ణయంతో ఆ అవసరం పూర్తిగా తొలగిపోయింది.

కొత్తగా అమల్లోకి వచ్చిన విధానంలో ఫేస్ ఆథెంటికేషన్తో పాటు ఓటీపీ (OTP) ఆధారంగా మొబైల్ నంబర్ అప్‌డేట్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఈ విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుండటంతో ప్రజలకు సమయం, ఖర్చు రెండూ ఆదా కానున్నాయి.

డిజిటల్ సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, ఉద్యోగులు, వృద్ధులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్