ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా

కరకగూడెం: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో బ్యాంకు శాఖ మేనేజర్‌తో పాటు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ విలువలు, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్రపై వారు సందేశాలు ఇచ్చారు. దేశ సమైక్యత, సమానత్వం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

అనంతరం మిఠాయిల పంపిణీతో కార్యక్రమం ముగిసింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంకు సిబ్బంది దేశభక్తి నినాదాలతో వేడుకలకు మరింత ఉత్సాహం నింపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్