ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్–2026 సర్వే : అంతరం అడవిలో ఫీల్డ్ పరిశీలన
పినపాక FRO తేజస్విని
పినపాక,ఆధాబ్ న్యూస్:
ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్–2026 సర్వేలో భాగంగా అంతరం అడవి కౌలురు నార్త్ బీట్ పరిధిలో శుక్రవారం ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నట్లు పినపాక FRO తేజస్విని తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సర్వే సందర్భంగా స్లోత్‌బేర్, బైసన్, సాంబార్ డీర్ తదితర వన్యప్రాణుల సంచారానికి సంబంధించిన పాదముద్రలు, ఇతర సూచక గుర్తులు గుర్తించినట్లు చెప్పారు.
సర్వేలో భాగంగా వన్యప్రాణుల ఉనికి, వాటి నివాస పరిస్థితులపై సమగ్ర అధ్యయనం కొనసాగుతోందని, అవసరమైన ఫోటో ఆధారాలు కూడా సేకరిస్తున్నామని వివరించారు.
అధికారులు మాట్లాడుతూ… ఈ సర్వే ద్వారా అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య, సంచారం, నివాస ప్రాంతాల స్థితిగతులపై స్పష్టత వస్తుందని తెలిపారు. వన సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు ఈ సర్వే అత్యంత కీలకమని పేర్కొన్నారు.









