ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రోడ్డుపై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి: డీఎస్పీ రవీందర్ రెడ్డి

రోడ్డుపై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి: డీఎస్పీ రవీందర్ రెడ్డి

కరకగూడెం,ఆధాబ్ న్యూస్
రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. కరకగూడెంలో నిర్వహించిన రహదారి భద్రత అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైక్ వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అని స్పష్టం చేశారు. అలాగే కారు డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించడం అనివార్యం అని తెలిపారు. రహదారి ప్రమాదాలను నివారించాలంటే ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.
వేగంగా వాహనాలు నడపకుండా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి కుటుంబ సభ్యుల రక్షణ కోసం ట్రాఫిక్ నియమాలు పాటించాలని డీఎస్పీ కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!