ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  స్టాక్ ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ.2.58 కోట్లు కాజేసిన సైబర్ మోసగాళ్లు

స్టాక్ ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ.2.58 కోట్లు కాజేసిన సైబర్ మోసగాళ్లు

హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులతో భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ నుంచి సైబర్ మోసగాళ్లు రూ.2.58 కోట్లు దోచుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం… స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే 500 శాతం లాభాలు వస్తాయని మోసగాళ్లు ఆశ చూపారు. వారి మాటలు నమ్మిన ఊర్మిళ 2025 డిసెంబరు 24 నుంచి 2026 జనవరి 5 వరకు 19 విడతలుగా మొత్తం రూ.2.58 కోట్లను వివిధ ఖాతాలకు బదిలీ చేశారు. ఇందుకోసం ఆమె తన వద్ద ఉన్న బంగారంతో పాటు భర్త వద్ద ఉన్న బంగారంపై కూడా రుణం తీసుకుని పెట్టుబడులుగా చెల్లింపులు చేసినట్లు సమాచారం.

తొలుత లాభాల పేరుతో కొన్ని మొత్తాలు వచ్చినప్పటికీ, అనంతరం డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసగాళ్లు తప్పించుకోవడంతో తనకు మోసం జరిగిందని ఆమె గ్రహించారు. దీంతో ఈ నెల జనవరి 6న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు… సంబంధిత బ్యాంక్ ఖాతాల ట్రాన్సాక్షన్లు, మొబైల్ నంబర్లు, వాట్సాప్ చాట్ డేటా ఆధారంగా మనీ ట్రైల్స్‌ను ట్రేస్ చేస్తూ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

సైబర్ క్రైమ్ అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ… అసాధారణ లాభాలు (500%, 300% వంటి హామీలు) ఇస్తామంటూ వచ్చే మెసేజ్‌లు, గ్రూప్ లింకులు, ట్రేడింగ్ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….