ప్రతి క్షణం
ప్రజల పక్షం

  టీడీపీ బలోపేతానికి కార్యకర్తలే బలం: వట్టం నారాయణ దొర

టీడీపీ బలోపేతానికి కార్యకర్తలే బలం: వట్టం నారాయణ దొర
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
మణుగూరు మండల కేంద్రంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ పినపాక నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పినపాక నియోజకవర్గ టీడీపీ అడ్‌హాక్ కమిటీ సభ్యులు వట్టం నారాయణ దొర మాట్లాడుతూ, పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని అన్నారు.

స్థానికంగా టీడీపీ మరింత బలోపేతం కావాలంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయిలో పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేయాలని కోరారు. భవిష్యత్తులో టీడీపీ క్రియాశీలంగా ఎదుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ నెల 23వ తేదీ నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ దిమ్మెల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో నియోజకవర్గ మండల మాజీ అధ్యక్షులు దొడ్డి కిష్ట, సిరిశెట్టి కమలాకర్, తోట వెంకటేశ్వర్లు, పరమేష్, మాజీ సర్పంచ్ బచ్చల భారతి, మాజీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి పాయం లక్ష్మీనారాయణ, టౌన్ అధ్యక్షులు పూర్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి బోళ్ళ ఆంజనేయులు, పట్టణ కోశాధికారి ముసునూరి చందర్‌రావు, మండల ప్రధాన కార్యదర్శి మద్దెల భద్రయ్యతో పాటు పార్టీ సీనియర్ నేతలు యార్లగడ్డ రాజా, ముమ్మినేని సత్యనారాయణ, వాసు, భాస్కర్, చావా రామారావు, చావా శ్రీదేవీ, ఖముర్నిష్ బేగం, దర్పునేని హరి, బచ్చల సుమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్