కరకగూడెం గ్రామ సర్పంచ్‌గా పోలేబోయిన సుజాత ప్రమాణ స్వీకారం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో కరకగూడెం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా పోలేబోయిన సుజాత సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర, టీపీసీసీ సభ్యులు డా. చందా సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గానికి, ముఖ్యంగా సర్పంచ్ పోలేబోయిన సుజాతకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీస్సులు, నమ్మకంతో గెలుపొందిన సుజాత గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిరంతరం కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా సర్పంచ్ ముందుండి పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగబండి వెంకటేశ్వర్లు, మండల నాయకులు ఎర్ర సురేష్, జలగం కృష్ణ, కునుసోత్ సాగర్, ముంజాల సాయిబాబా, గోగ్గలి రవి, షేక్ రఫీ, చందా నాగేశ్వరరావు, చందా వెంకటరత్నమ్మ, జట్ల సత్యం, బిలపాటి సంపత్, దంచనాల రాజేంద్రప్రసాద్ తదితర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









