లోయలో పడిన ప్రైవేట్ బస్సు.. 15 మంది మృతి
చింతూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
చిత్తూరు,ఆధాబ్ న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి ఘాట్‌రోడ్డు వద్ద లోయలో పడిపోయింది. ఈ భయానక ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది మృతి చెందినట్లు సమాచారం.
చింతూరులో నుంచీ మారేడుమిల్లి దిశగా ప్రయాణిస్తున్న బస్సులో ప్రయాణికులు భారీ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు లోయలో పడిన వెంటనే ప్రయాణికులు కేకలు, అర్తనాదాలు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ దర్శనం చేసుకుని అన్నవరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 47









