ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి ఆదేశాలు…

పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి ఆదేశాలు…
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మణుగూరు డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి తెలిపారు.

ప్రజలు ఎటువంటి భయం లేకుండా, ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, ఎటువంటి అవాంఛనీయం జరగకుండా కట్టుదిట్టంగా భద్రతను చేపట్టాలని ఆదేశించారు.

సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ స్టేషన్ హద్దులను దాటి వెళ్లవద్దని, ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలన్నారు.

ఈ సందర్భంగా కొన్ని రాజకీయ నాయకులు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించిన సందర్భంలో చట్టవిరుద్ధ చర్యలు చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!