ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం పోలీసుల సమావేశం: శాంతియుత ఎన్నికల నిర్వహణకు సూచనలు

కరకగూడెం పోలీసుల సమావేశం: శాంతియుత ఎన్నికల నిర్వహణకు సూచనలు

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు కరకగూడెం పోలీస్ అధికారులు అభ్యర్థులు, ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంలో మణుగూరు ఎస్ డి పి ఓ వి. రవీందర్ రెడ్డి, ఏడుల్లా బయ్యారం సీఐ వి. వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు. రావు సిబ్బందితో కలిసి కరకగూడెం మండలంలోని సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ఎస్డి .పి. ఓ రవీందర్ రెడ్డి పేర్కొన్న సూచనలు:

1. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరగడానికి గ్రామస్తులు, అభ్యర్థులు సహకరించాలి.

2. గొడవలు, దూషణలు, అనవసర వాదనలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.

3. ఎన్నికల రోజున విజయోత్సవ ర్యాలీలు నిషేధం. ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోబడతాయి.

4. ఓటర్లను బెదిరించడం, ప్రలోభ పెట్టడం వంటి చర్యలు శిక్షార్హం.

5. పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో సహించబడవు.

6. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS (144 CrPC) అమల్లో ఉంటుంది. గుంపులుగా నిలబడరాదు.

 

ఓటర్లు, అభ్యర్థులు ఈ సూచనలను పాటించి పోలీసులకు సహకరించాల్సిందిగా ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏడుల్లా బయ్యారం సీఐ కరకగూడెం ఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!