ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఉత్తమ గ్రామీణ విలేకరి అవార్డు నరేష్‌కు ప్రదానం

ఉత్తమ గ్రామీణ విలేకరి అవార్డు నరేష్‌కు ప్రదానం
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం చెందిన విలేకరి నరేష్‌ “ఉత్తమ గ్రామీణ విలేకరిగా” ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా నరేష్‌కు నగదు అవార్డు మరియు ప్రశంసాపత్రం అందజేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, స్థానిక ఇబ్బందులను ప్రజల ముందుకు తీసుకురావడంలో నరేష్ చూపిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డు ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ, “గ్రామీణ ప్రజల సమస్యల్ని వెలుగులోకి తేవడం నా జర్నలిజం బాధ్యత. ఈ అవార్డు నాకు మరింత ప్రేరణనిచ్చింది” అని పేర్కొన్నాడు.

స్థానిక ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, గ్రామస్థులు నరేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్