ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  అశ్వాపురం మండలంలో నామినేషన్ కేంద్రాల పరిశీలన – మణుగూరు ఎస్డిపిఓ రవీందర్ రెడ్డి,

అశ్వాపురం,ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతున్న నేపథ్యంలో మణుగూరు ఎస్డిపిఓ రవీందర్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యటించారు. ఆయనతో పాటు అశ్వాపురం సి‌ఐ కూడా పాల్గొన్నారు.

ఎస్డిపిఓ రవీందర్ రెడ్డి అశ్వాపురం, మొండికుంట, తుమ్మల చెరువు, గొందిగూడెం నామినేషన్ కేంద్రాలను వరుసగా సందర్శించి అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కేంద్రాల్లో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి,

ఎన్నికల సమయంలో చట్టం, శాంతి భద్రతను కచ్చితంగా కాపాడాలని,

నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని,

ప్రజలతో గౌరవంగా వ్యవహరిస్తూనే, సెక్యూరిటీ విషయంలో కఠినంగా ఉండాలని

స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

గ్రామాల్లో ఎన్నికల వాతావరణం ప్రశాంతంగా కొనసాగుతున్నదని, అవసరమైన అదనపు బందోబస్తు కూడా సిద్ధంగా ఉంచినట్లు ఎస్డిపిఓ తెలిపారు.

అశ్వాపురం మండలంలో ఈసారి నామినేషన్ ప్రక్రియలో పోలీసులు అప్రమత్తంగా పనిచేస్తున్నారని స్థానికులు అభినందిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….