ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్
మధిర,ఆధాబ్ న్యూస్ : భవన నిర్మాణ కార్మికుడి ఇన్సూరెన్స్ బిల్లు పాస్ చేయడానికి లంచం తీసుకుంటూ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ ఏసీబీ వలలో చిక్కాడు.
భవన కార్మికుడు మృతి చెందడంతో, అతని పేరుపై వచ్చే ₹1.30 లక్షల ఇన్సూరెన్స్ బిల్లును పాస్ చేసేందుకు చందర్ ₹15,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
మృతుడి భార్య నుంచి ఖమ్మం రోడ్‌పై లంచం తీసుకుంటుండగా, ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని బృందం చాకచక్యంగా వెంటాడి రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Post Views: 63









