కరకగూడెం మండలంలో రహదారుల మరమ్మత్తుల కోసం బీఆర్ఎస్ నాయకుల వినతి
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల వ్యాప్తంగా ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతలను తక్షణమే మరమ్మత్తు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి వినతి పత్రం అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రెగా కాంతారావు ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మండలంలోని ముఖ్య రహదారులు దెబ్బతిని గుంతలు ఏర్పడడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, రహదారులను వెంటనే సరిదిద్దాలని మండల ప్రజా పరిషత్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్‌కు బీఆర్ఎస్ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, సోషల్ మీడియాలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.









