కిన్నెరసాని అరణ్యంలో పర్యటించిన అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగళ్ళ రేంజ్ పరిధిలోని రంగాపురం బేస్ క్యాంపు అరణ్యంలో మంగళవారం అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ పర్యటించారు. అరణ్య సంరక్షణ, అభివృద్ధి పనుల పురోగతిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
పర్యటన సందర్భంగా ప్లాంటేషన్ అభివృద్ధి, అటవీ జంతువులకు తాగునీటి సౌకర్యం, అటవీ రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వంటి అంశాలను సమీక్షించారు. అటవీ సంరక్షణలో నిబద్ధతతో పనిచేస్తున్న అటవీ శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ రేగళ్ళ రేంజర్ జశ్వత్ ప్రసాద్, సెక్షన్ ఆఫీసర్ చిలకమర్రి శ్రీను, బీట్ ఆఫీసర్లు సుమన్, నాగేంద్రబాబు, గౌతమ్ నాయక్ పాల్గొన్నారు.
Post Views: 128









