మణుగూరులో 144 సెక్షన్ అమలు
మణుగూరు,ఆధాబ్ న్యూస్: మణుగూరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో మణుగూరు పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పట్టణంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా, ముగ్గురికి మించి గుంపుగా కూడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలు శాంతి భద్రతలను కాపాడుతూ చట్టానికి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Post Views: 50









