వరంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్ :
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో వరంగల్ చేరుకోనున్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించేందుకు సీఎం పర్యటన చేపట్టారు.
వరదల ప్రభావం, పంటలకు జరిగిన నష్టంపై అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం — ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ధాన్యం సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆదేశించారు. అవసరమైతే ధాన్యాన్ని సమీపంలోని ఫంక్షన్ హాల్స్ లేదా భద్రమైన ప్రదేశాలకు తరలించాలన్నారు.
వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న మండలాల్లో కలెక్టర్లు, వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పరిస్థితులను పర్యవేక్షించాలనే సూచనలు సీఎం ఇచ్చారు.









