ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  ప్రజలకు అండగా గులాబీ జెండా గొల్లగూడెం, పద్మాపురం, అనంతారం గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ

ప్రజలకు అండగా గులాబీ జెండా

గొల్లగూడెం, పద్మాపురం, అనంతారం గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశానుసారం గ్రామ గ్రామాన బీఆర్ఎస్ జెండా పండుగ కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కరకగూడెం మండలంలోని పద్మాపురం, అనంతారం గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాను ఎగరవేయడం జరిగింది.

పద్మాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తోలెం రామారావు మాట్లాడుతూ…
“కేసీఆర్ పాలనలోనే నిజమైన అభివృద్ధి జరిగింది. ప్రజలు మళ్లీ అదే అభివృద్ధిని కోరుకుంటున్నారు. అందుకే గులాబీ జెండా అభిమానం రోజు రోజుకీ పెరుగుతోంది” అన్నారు.

అనంతారం గ్రామ కమిటీ అధ్యక్షులు అత్తె నాగేశ్వరావు మాట్లాడుతూ…
“ప్రజల సమస్యలు తెలుసుకునేది, వాటిని పరిష్కరించేది బీఆర్ఎస్ మాత్రమే. తదుపరి ఎన్నికల్లో గులాబీ పార్టీనే విజయం సాధిస్తుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో సమాత్ మోతె (గొల్లగూడెం) గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మలకం వెంకటేశ్వర్లు నాయకత్వంలో గులాబీ జెండా ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
“కాంగ్రెస్ పార్టీ లేనిపోని హామీలతో ప్రజలను మోసం చేసింది. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్‌పైనే విశ్వాసం పెడతారు. ఎన్నికలు ఎప్పుడైనా వచ్చినా గులాబీ సైన్యం సిద్ధంగానే ఉంది” అన్నారు.

“ఏ ఎన్నికైనా… గులాబీ సైన్యం సొంతం” నినాదాలతో కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి.

ఈ కార్యక్రమాల్లో మాజీ ప్రజాప్రతినిధులు, మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్, పార్టీ కో-ఆర్డినేటర్ సుతారి నాగేష్, బట్టా బిక్షపతి, ఇర్ప సత్యం, ఇర్ప నాగేష్, కుంజ లక్ష్మయ్య, అంజయ్య, పుల్లయ్య, ఆదినారయణ, రమేష్, కుమారస్వామి, వంశీ, కుషేలుడు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….