ఇద్దరిని ఢీకొట్టి… కంగారులో చెట్టుకు ఢీ
ముగ్గురికి తీవ్ర గాయాలు
మణుగూరు, ఆధాబ్ న్యూస్: మణుగూరు తోగ్గూడెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా దూసుకెళ్తున్న కారు రహదారి పక్కన నడుస్తున్న ఇద్దరిని ఢీకొట్టడంతో డ్రైవర్ కంగారుపడి ఎదుటి నుంచి వస్తున్న వాహనాన్ని తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రక్రియలో కారు అదుపు తప్పి రోడ్డుకిరువైపున ఉన్న చెట్టుకు ఢీకొట్టింది.
ప్రమాదంలో ఇద్దరు పాదచారులు, కారులో ప్రయాణించిన వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
Post Views: 46









