స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలవుతాయా?
23న క్యాబినెట్ సమావేశం రోజున తుది నిర్ణయం
హైదరాబాద్, అక్టోబర్ 21 (ఆధాబ్ న్యూస్):
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలవుతాయా అనే ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడం, అనంతరం సుప్రీంకోర్టులో పిటిషన్ కొట్టివేయడంతో ఆ నిర్ణయం నిలిచిపోయింది.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా, లేక పాత రిజర్వేషన్ విధానాన్నే కొనసాగిస్తుందా అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది.
ఈ నెల 23న జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నిర్ణయం బీసీ వర్గాలకే కాకుండా మొత్తం రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు, రాజకీయ పక్షాలు, సామాజిక సంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.









