పినపాక, ఆధాబ్ న్యూస్:
మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో భద్రతా చర్యల భాగంగా బయ్యారం, పినపాక ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారులు, అంతర్గ్రామ మార్గాలపై వాహనాలను ఆపి సోదాలు నిర్వహించారు.
ప్రతీ వాహనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తులపై విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
భద్రతా పరమైన చర్యలలో భాగంగా రాత్రి వేళల్లో కూడా పహారా కొనసాగించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Post Views: 45









