ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  మాదక ద్రవ్య రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం: ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ “Say No to Drugs – Yes to Life” నినాదంతో ‘చైతన్యం’ అవగాహనా కార్యక్రమం ప్రారంభం

మాదక ద్రవ్య రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం: ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

“Say No to Drugs – Yes to Life” నినాదంతో ‘చైతన్యం’ అవగాహనా కార్యక్రమం ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో జిల్లా పోలీసులు “చైతన్యం” పేరుతో నెలరోజుల పాటు అవగాహనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

జిల్లా పోలీసు అధికారి రోహిత్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్‌కు ‘నో’, లైఫ్‌కి ‘యెస్’ చెప్పాలి. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్‌-ఫ్రీ డిస్ట్రిక్ట్‌గా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,” అని పిలుపునిచ్చారు.నెలరోజుల పాటు అవగాహనా కార్యక్రమాలు

అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రజా ప్రదేశాల్లో అవగాహనా ర్యాలీలు, సదస్సులు, పోస్టర్ ప్రచారాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ “చైతన్యం” పోస్టర్లను ఆవిష్కరించారు. మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజల సహకారం కీలకమని ఆయన అన్నారు.
గంజాయి రవాణాపై కఠిన చర్యలు

ఎస్పీ తెలిపారు — జిల్లాలోని మత్తు పదార్థాల హాట్‌స్పాట్ ప్రాంతాల్లో నిత్య తనిఖీలు, రైడ్లు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు.మత్తు పదార్థాలు సేవిస్తున్నా, రవాణా చేస్తున్నా లేదా విక్రయిస్తున్నా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. ఎవరికైనా సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలపండి,” అని ఆయన విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

ఈ కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….