ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన డాక్టర్ జి. సంజీవరావు

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
డాక్టర్ జి. సంజీవరావు

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: మండలంలోని కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్ భద్రాచలం సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌కు చెందిన పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్య బృందం ఈ శిబిరాన్ని నిర్వహించింది.

ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శిబిరంలో ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జి. సంజీవరావు పర్యవేక్షణలో మొత్తం 250 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో 60 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డా. సంజీవరావు మాట్లాడుతూ, “ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం. ప్రజల స్పందన చాలా ఉత్తేజకరంగా ఉంది. పేద ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య సేవలు మరింతగా అందించాలని సంస్థలను అభ్యర్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.

శిబిరంలో పాల్గొన్న వైద్యులను, నిర్వాహకులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు డా. ఎస్.ఎల్. కాంతారావు, రాజిరెడ్డి, ఆదినారాయణ, సూర్యనారాయణతో పాటు గ్రామస్తులు గొగ్గల నారాయణ, ఈసం సమ్మయ్య, ఈసం సత్యం, కొమరం లక్ష్మీనర్సు, జోగ దూలయ్య, రామకృష్ణ, మారుతి నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….