ప్రతి క్షణం
ప్రజల పక్షం

  దసరా క్రికెట్ టోర్నీలో అతిక్ ఖాన్ ఘన విజయం.

 

దసరా క్రికెట్ టోర్నీలో అతిక్ ఖాన్ ఘన విజయం.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో దసరా పండుగ సందర్భంగా రెండు జిల్లాల స్థాయిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో పద్మాపురం గ్రామానికి చెందిన పటాన్ అతిక్ ఖాన్ అద్భుత ప్రదర్శనతో నిలిచారు.

నాలుగు మ్యాచ్‌లలో 18 వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో 88 పరుగులు సాధించిన అతిక్ ఖాన్ ప్రతిభను గుర్తించిన టోర్నీ నిర్వాహకులు ఆయనకు ‘మ్యాన్ ఆఫ్ ది సీరిస్’ అవార్డు మరియు రూ. 3,016 నగదు బహుమతి అందజేశారు.

అతిక్ ఖాన్ మాట్లాడుతూ, “నా ప్రదర్శనలో సహకరించిన జట్టు సభ్యులు, గ్రామస్థుల ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఇంకా మెరుగైన స్థాయిలో రాణించేందుకు ప్రయత్నిస్తాను” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు సంతోష్, కోటి, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!