గిరిజన ప్రాంతంలో వైద్య సేవలను అందించడమే నా లక్ష్యం ఆయేషా సమీరా.
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలానికి చెందిన ఆర్.ఎం.పీ డాక్టర్ మహమ్మద్ రఫీ కుమార్తె మహమ్మద్ ఆయేషా సమీరా ఇటీవల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించారు.
అయితే ఆమె లక్ష్యం కేవలం చదువుకోవడమే కాదు — భవిష్యత్తులో గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను అందించడం అని అన్నారు. “నాకు ఈ అవకాశం లభించడం నా తండ్రి ప్రేరణ ఫలితం. ఆయన చిన్నప్పటి నుంచీ గిరిజన గ్రామాల్లో సేవ చేశారు. అదే మార్గంలో నడవాలని అనుకుంటున్నాను,” అని ఆయేషా సమీరా తెలిపారు.
Post Views: 465









