కరకగూడెం మండల జడ్పీటీసీ బరిలో కటుకోజ్వల గీత
ప్రజా సేవే నా ధ్యేయం: గీత
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
స్థానిక సంస్థల ఎన్నికల వేళ కరకగూడెం మండల రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. బీసీ మహిళా కోటాలో కేటాయించిన జడ్పీటీసీ స్థానానికి కటుకోజ్వల గీత బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
“బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు నాపై విశ్వాసం ఉంచి అవకాశం ఇస్తే, ప్రజల ఆశీస్సులతో తప్పకుండా గెలిచి చూపిస్తాను. ప్రజా సేవే నా ధ్యేయం” అని గీత విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.
ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండడం తన లక్ష్యమని ఆమె తెలిపారు. గ్రామీణ అభివృద్ధికి ప్రజలతో మమేకమై పనిచేసే నాయకత్వం అవసరమని, రాజకీయాలు ప్రజా సేవకు వేదిక కావాలని గీత స్పష్టం చేశారు.
Post Views: 139









