జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పోలీస్ వాహనాల తనిఖీ
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
కోత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ శనివారం పోలీస్ శాఖలో వినియోగిస్తున్న వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల డ్రైవర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు.
ఎస్పీ మాట్లాడుతూ – “పోలీస్ శాఖ వాహనాలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేలా వాటి కండిషన్‌ను ప్రతిరోజూ తనిఖీ చేయాలి. డ్రైవింగ్ సమయంలో నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. విధుల్లో అప్రమత్తతతో వ్యవహరించాలి. ఆకస్మికంగా వాహనం ఆగిపోయిన సందర్భంలో సమయస్ఫూర్తితో వ్యవహరించేంత కనీస పరిజ్ఞానం డ్రైవర్లకు ఉండాలి” అని సూచించారు. క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేసే వారికే పోలీస్ శాఖలో మంచి పేరు లభిస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ మోటారు వాహనాల అధికారి సుధాకర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, హోమ్ గార్డ్స్ ఆర్ఐ నరసింహారావు, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.









