ఏసీబీ వలలో ఎల్లంపేట టౌన్ ప్లానింగ్ అధికారి
మేడ్చల్,ఆధాబ్,న్యూస్: ఎల్లంపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. ఒక వెంచర్ అనుమతి కోసం రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆయన, ముందుగానే రూ.1 లక్ష తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
శనివారం కార్యాలయంలో రూ.3.5 లక్షలు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయనను వలపన్ని పట్టుకున్నారు. రాధాకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Post Views: 44









