ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్

జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. సోమవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను ప్రతీ పట్టణం, మండల కేంద్రం, గ్రామాల్లో ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

సద్దుల బతుకమ్మ కోసం తగిన ప్రదేశాలను గుర్తించి, లైటింగ్, సౌండ్ సిస్టమ్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు ముందుగానే సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొనేందున భద్రతా చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.

బతుకమ్మ నిమజ్జనాల సమయంలో ప్రమాదాలు జరుగకుండా ఇరిగేషన్ శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ శాఖ సమగ్ర బందోబస్తు ఏర్పాటు చేసి, రెస్క్యూ టీంలను అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు.

వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లు, అత్యవసర ఔషధాలను వేడుకల ప్రాంగణాల్లో సిద్ధం ఉంచాలని ఆరోగ్య శాఖకు సూచించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగను ఉత్సాహంగా జరుపుకునేలా ప్రతి శాఖ కట్టుదిట్టమైన సమన్వయం చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మ ప్రత్యేక గుర్తింపు పొందిందని గుర్తుచేసిన కలెక్టర్, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. శుభ్రత, భద్రత, సాంప్రదాయ పరిరక్షణపై దృష్టి పెట్టి జిల్లా మొత్తం పండుగ వాతావరణంలో కళకళలాడేలా చూడాలని ఆయన సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….