ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ. రోహిత్ రాజు ఎదుట ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు

భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ. రోహిత్ రాజు ఎదుట ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు

ఆపరేషన్ చేయూత ప్రభావం – ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున తక్షణ సహాయం

భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్: సెప్టెంబర్ 18:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు, ఐపీఎస్ ఎదుట మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు లొంగిపోయారు. పోలీసులు, 81 మరియు 141 సిఆర్పిఎఫ్‌ బెటాలియన్ అధికారులు ఆదివాసి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిర్వహిస్తున్న “ఆపరేషన్ చేయూత” కార్యక్రమం ప్రభావంతో వీరు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు.

లొంగిపోయిన వారిలో ఒకరు ACMS, ఒకరు పార్టీ సభ్యుడు, నలుగురు మిలీషియా సభ్యులు ఉన్నారు. ఈ రోజు వారందరికీ తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.25 వేలు చొప్పున మొత్తం రూ.1.50 లక్షలు అందజేయబడ్డాయి. ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు పూర్తయ్యిన తర్వాత వారి ర్యాంక్‌ల ఆధారంగా మిగిలిన మొత్తాన్ని చెక్కుల రూపంలో జమ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

జనవరి 2025 నుంచి ఇప్పటివరకు ఆపరేషన్ చేయూత ద్వారా DVCMS-04, ACMs-22, పార్టీ సభ్యులు-41, మిలీషియా-120, RPC-35, DAKMs/KAMSs-47, CNM-30, GRD-21 లొంగిపోయి ప్రభుత్వం అందిస్తున్న పునరావాస సౌకర్యాలను పొందారు.

ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ మహిళా నాయకురాలు పోతుల పద్మావతి @ కల్పన @ మైనక్క @ సుజాతక్క సెప్టెంబర్ 13న డీజీపీ ఎదుట లొంగగా, ఆమెకు వెంటనే రూ.25 లక్షల పునరావాస సాయం అందజేయడం జరిగింది.

ప్రభుత్వం, పోలీసులు ఆదివాసి ప్రాంతాల అభివృద్ధి కోసం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, తాగునీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలను విస్తృతంగా మెరుగుపరుస్తున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.

మావోయిస్టులకు సహకరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!