కరకగూడెం ఆదివాసీ జేఏసీ నాయకుడు రాష్ట్రస్థాయి గుర్తింపు
కరకగూడెం, సెప్టెంబర్ 18: ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు పోలేబోయిన వెంకటనారాయణ తెలంగాణ రాష్ట్ర 9 తెగల ఆదివాసీ జేఏసీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. ఆదివాసీ సంఘాల ఐక్యవేదికగా ఏర్పడిన జేఏసీ తక్కువ సమయంలో విజయవంతంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని నాయకులు అభినందించారు.
లంబాడిలను చట్టబద్ధత లేకుండా తొలగించాలనే ఉద్యమంలో ఆదివాసీ 9 తెగల ధర్మయుద్ధంలో భాగంగా వెంకటనారాయణ ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా కరకగూడెం మండల ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు
Post Views: 98









