పినపాకలో రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మహిళకు తీవ్ర గాయాలు
పినపాక ,ఆధాబ్ న్యూస్:
పినపాక మండలం ఐలాపురం గ్రామంలోని బ్రిడ్జి వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఒక కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, అతని వెంట ఉన్న మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన మహిళను స్థానికులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు, గాయపడిన మహిళ పరిస్థితి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.
ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 32









