తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి నియామకం
హైదరాబాద్ ఆధాబ్,న్యూస్: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. ఈ క్రమంలో నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ కొత్త నియామకాలు చేపట్టారు.
ముఖ్యంగా, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఎండీగా సేవలందించిన సీనియర్ అధికారి ఎన్వీఎస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆయన అనుభవం, పరిపాలనా నైపుణ్యం ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఉపయోగకరంగా ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
Post Views: 39









