పినపాకలో దసరా మెగా క్రికెట్ టోర్నీ కరపత్రాల ఆవిష్కరణ
పినపాక,ఆధాబ్ న్యూస్: దసరా పండుగ సందర్బంగా గోపాలరావుపేట గ్రామంలో నిర్వహించనున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ కరపత్రాలను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా గోపాలరావుపేటలో నియోజకవర్గ స్థాయిలో భారీ ఎత్తున క్రికెట్ పోటీలను నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. క్రీడల ద్వారా యువతలో స్నేహభావం, క్రీడాస్ఫూర్తి పెంపొందుతుందని అన్నారు. అలాగే ఈ టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు ప్రతిభను ప్రదర్శించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
Post Views: 34









