ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచనలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచనలు

భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులను సంబంధిత కార్యాలయాలకు మాత్రమే అందజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు.

కొత్తగూడెం డివిజన్‌కు సంబంధించిన భూ సమస్యలు కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో, భద్రాచలం డివిజన్‌కు సంబంధించిన భూ సమస్యలు భద్రాచలం సబ్-కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు.

ఇతర సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఇన్‌వర్డ్‌ సెక్షన్‌లో అందజేసి రసీదు పొందవచ్చని, ఆ దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపిస్తారని కలెక్టర్ తెలిపారు.

అలాగే, రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో ప్రజావాణి జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!