ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి : సీఐ వెంకటేశ్వరరావు

అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి : సీఐ వెంకటేశ్వరరావు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
అసాంఘిక కార్యకలాపాలకు ప్రజలు, ముఖ్యంగా యువత దూరంగా ఉండాలని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, గంజాయి త్రాగడం, అమ్మడం, కొనడం, సరఫరా చేయడం, పేకాట ఆడటం–ఆడించడం, కోడి పందాలు, గుడుంబా త్రాగడం, తయారీ వంటివి చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. యువత చెడు వ్యసనాలకు లోనై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, గంజాయి సేవించడం కానీ, రవాణా చేయడం కానీ, అమ్మడం–కొనడం కానీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పేకాట, కోడి పందాల వంటి జూదాలకు అలవాటు పడి వ్యక్తులు జీవితాలను పాడు చేసుకోవడమే కాక కుటుంబాలను రోడ్డుపైకి తెస్తున్నారని పేర్కొన్నారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లో కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా గంజాయి వంటి నిషేధిత పదార్థాల రవాణా, విక్రయం, సేవనంపై లేదా పేకాట, కోడి పందాలపై సమాచారం తెలిసినా తక్షణమే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

📞 సమాచారం కోసం సంప్రదించవలసిన నంబర్లు:

CI-ఏడూళ్ల బయ్యారం : 8712682097

SI-కరకగూడెం : 8712682102

గమనిక: సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!