ప్రతి క్షణం
ప్రజల పక్షం

  శంకర్‌పల్లి దోపిడీ కేసులో డ్రైవర్ మధు గ్యాంగ్‌ – ఏడుగురు పోలీసుల చెరలో

శంకర్‌పల్లి దోపిడీ కేసులో డ్రైవర్ మధు గ్యాంగ్‌ – ఏడుగురు పోలీసుల చెరలో
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:
వికారాబాద్‌కు చెందిన స్టీల్‌ వ్యాపారి డ్రైవర్‌ మధు సూత్రధారిగా వ్యవహరించిన దోపిడీ కేసులో శంకర్‌పల్లి పోలీసులు ఏడు మందిని అరెస్టు చేశారు. వ్యాపారి రాకేశ్‌ అగర్వాల్‌కు రావాల్సిన రూ.40 లక్షలు తీసుకొస్తున్న మధు, సహాయకుడు సాయిబాబాపై నకిలీ దాడి చేసి గ్యాంగ్‌తో కలిసి నగదు దోచుకున్నారు. హుస్సేన్‌పూర్‌–పర్వేద రహదారిలో కారు ఢీకొట్టి, తుపాకీ-కత్తులతో బెదిరించి డబ్బు తీసుకెళ్లారు. అనంతరం కారు బోల్తా పడటంతో రూ.8.5 లక్షలు అక్కడే వదిలేసి మిగతా మొత్తంతో పరారయ్యారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు జడ్చర్లలో నిందితులను పట్టుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్