ప్రతి క్షణం
ప్రజల పక్షం

  బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ, మాజీ

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చొప్పాల గ్రామ పంచాయితీ పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు జాడి మురళీధర్, జాడి నరసింహారావు, అలాగే బీఆర్‌ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు జాడి రామానాథం తల్లి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు, పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు దశదినకర్మలకు హాజరై, లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం నూరిపోశారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!